Slider తెలంగాణ

సీఎం కేసీఆర్ కు అందరూ రుణపడి ఉండాలి

kollapur ing 2

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఆర్డిఓ హనుమ నాయక్ అధ్యక్షతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎంపిపి గాదెల సుధారాణి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆర్డీవో ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సింగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాలమూరు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారన్నారు. అదేవిధంగా వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు త్వరలో పూర్తి కాబోతుందన్నారు. కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే సాధ్యమైందన్నారు. నాలుగు మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ చేశారన్నారు. నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉండాలన్నారు. అంతకుముందు కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో మాజీ మంత్రి జూపల్లి,ఎమ్మెల్యే బీరం అనుచరులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తం  అయ్యారు. ఇరువర్గాలను అదుపు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి లక్ష్మీనారాయణ, సిఐ బి.వెంకట్ రెడ్డి, ఎస్సై కొంపల్లి మురళి గౌడ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో  తాహసిల్దార్ వీరభద్రప్ప రాజేశ్వరి మాజీ రత్న ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పీసీసీ కార్యనిర్వహణ కార్యదర్శి కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు

Related posts

అన్యాయం చేస్తున్న కలెక్టర్.. లాఠీలతో కొట్టిన పోలీసులు

Satyam NEWS

లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళా టీచర్ మృతి

Satyam NEWS

పోలీసు సంక్షేమానికే ఐఓసీఎల్ పెట్రోల్ బంకు నిర్మాణం

Satyam NEWS

Leave a Comment