37.2 C
Hyderabad
April 19, 2024 11: 01 AM
Slider ఆదిలాబాద్

ఆపదలో ఉన్నప్పుడు ప్రతి బాలిక 100 కు డయల్ చేయాలి

sabitha

పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలని లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ కస్తూరిబా బాలికల విద్యాలయం లో రూ రెండు కోట్ల ఐదు లక్షల వ్యయంతో నిర్మించనున్న  బాలికల జూనియర్ కళాశాల భవనమునకు రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని అన్నారు.

ప్రతి విద్యార్థి కలలు కనాలని ఆ కలల సాకారానికి ప్రభుత్వం కృషి  చేస్తుందన్నారు. రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయని వాటిలో 97.97 శాతం మంది మొత్తం మీద సాధిస్తారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ఆత్మవిశ్వాసంతో ప్రతి విద్యార్థి తమ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించడం కలలు కనాలని, వాటి సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 177 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ను అప్ గ్రేడ్ చేశామని తెలిపారు.

ప్రతి విద్యార్థి సెలవులలో ఇంటికి వెళ్ళినప్పుడు చదువు రాని తమ తాత, తండ్రి, తల్లి తదితరులకు చదువు నేర్పిన చాలన్నారు. ప్రతి విద్యార్థి చెట్లను నాటాలని మరియు చుట్టుప్రక్కల వారికి చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయాలని కోరారు. ప్లాస్టిక్ నిషేదానికి కృషి చేయాలన్నారు.

ఆపద సమయంలో ధైర్యంగా ఎదుర్కోవాలని, 100 కాల్ చేసి తెలియజేయాలని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందించారు. రాష్ట్ర అటవీ ,పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి తరువాత ఆడపిల్లల చదువు ఆపకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కస్తూర్బా బాలికల విద్యాలయలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసి బాలికలకు విద్య ప్రభుత్వం అందిస్తున్నాదని అన్నారు.

అన్ని కేజీబీవీ పాఠశాలల్లో, దేవాలయలకు మిషన్ భగీరథ మీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరిపల్లి విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు సాగర బాయి, జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్ర వోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ కిషన్ రెడ్డి, ఎంపీపీ కామేశ్వరరావు, మహిపాల్ రెడ్డి, జెడ్పిటిసి జీవన్ రెడ్డి, జిల్లా విద్యాధికారి ప్రణీత, ప్రిన్సిపాల్ శంకర్, పరమేశ్వర్, పాకాల రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS

కరోనాపై అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధుల

Satyam NEWS

హోళీ ట్రాజెడీ: సముద్రంలో మునిగి యువకుడి మృతి

Satyam NEWS

Leave a Comment