26.2 C
Hyderabad
February 14, 2025 01: 22 AM
Slider ఆదిలాబాద్

బాసర అమ్మవారిని దర్శించుకున్న సీతక్క

#seetakka

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు నిర్మల్ జిల్లా ఇంచార్జి మంత్రి  సీతక్క ఈరోజు ప్రసిద్ధ దేవాలయం బాసర సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుండి 3 వరకు జరిగే వసంత పంచమి ఉత్సాహలను ఘనంగా నిర్వహించాలని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్ని ఏర్పాట్లు చేయాలనీ పంచాయతీ రాజ్ శాఖ RWS శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ఉత్సహలలో బాసర దేవాలయ సిబ్బంది అందరూ కలిసి జాగ్రత్తగా పని చేయాలనీ కోరారు.

దర్శనం తరువాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొని రాబోవు స్థానిక సంస్థ ల ఎన్నికలలో ఐక్యము గా పనిచేసి అన్ని సీట్లు గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, MLC దండే విఠల్, TPCC జనరల్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ సత్తు మల్లేష్, నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజుమన్ అలీ, ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఇంచార్జి సుగుణక్క AMC చైర్మన్ ఆనంద్ రావు పాటిల్, PACS చైర్మన్ వెంకటేష్ గౌడ్,మాజీ మండల అధ్యక్షులు బాపూరావు, మాజీ సర్పంచ లు సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్ రావు, వైస్ చైర్మన్ MD ఫరూక్ అహ్మద్ డీసీసీబీ డైరెక్టర్ లు వెంకటేష్, నారాయణ రావు పటిల్,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, మాజీ జిల్లా పరిషత్  వైస్ చైర్మన్ రాజన్న,మల్కాన్న, మల్లన్న, మాజీ సర్పంచ్ రమేష్,మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ లు మాజీ డైరెక్టర్ లు,తాలూకా కాంగ్రెస్ నాయకులు, బాసర మండల కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి దేవాలయం లో ఎమ్మెల్యే హాడావుడి

Satyam NEWS

పోసాని కృష్ణ మురళీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి

Satyam NEWS

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment