వచ్చే నెలలో దోహా వేదికగా జరగనున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ కు ఈశాసింగ్ ఎంపికావడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. షూటింగ్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన అనంతరం ఈశాసింగ్ ఈరోజు తన తండ్రి సచిన్ సింగ్ తో కలసి క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిలను అసెంబ్లీ హల్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలో ముగిసిన సెలెక్షన్ ట్రాయల్స్ లో ఇషాసింగ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 244 స్కోర్ తో రికార్డు ప్రదర్శన చేసి ఆసియా షూటింగ్ ఛాంపియన్ లో చోటు సంపాదించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని.. వచ్చే నెలలో జరగబోయే ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో కూడా బంగారు పతకం తెస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, నిఖత్ తండ్రి జమీల్, రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.
previous post
next post