32.2 C
Hyderabad
April 20, 2024 19: 43 PM
Slider కరీంనగర్

శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న పర్యాటక మంత్రి

minister Srinivasagowd

వేములవాడ పట్టణం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు ఆయన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకంగా వేములవాడ, సిరిసిల్ల, మానేరు పరిసర ప్రాంతాలను సర్క్యూట్ గా గుర్తించి అభివృద్ధి చేయటానికి మంత్రి KTR సహకారంతో నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

వేములవాడ లోని పెద్ద చెరువు వద్ద నిర్మిస్తున్న మిని ట్యాంక్ బండ్ ను MLC, MLA  లతో కలసి మంత్రి పరిశీలించారు. అనంతరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ లో ఏర్పాట్లు పై సమీక్షా సమావేశం లో మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సమీక్ష లో శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, స్ధానిక శాసన సభ్యులు చెన్నమనేని రమేష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, టూరిజం MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ,  జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, SP రాహుల్ హెగ్డే, దేవస్థానం E O శ్రీమతి కృష్ణవేణి, రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీ గా ఖ్యాతిని గడించిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు, మొబైల్ టాయిలెట్స్, మంచినీటి సరఫరా, పట్టణ సుందరీకరణ , స్నానపు గదులు, వసతులు కల్పించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సాంస్కృతిక వేడుక ‘ శివారచ్చన’  భక్తి,  ఆధ్యాత్మిక, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే విధంగా కార్యక్రమాలను ఈ నెల 20, 21 తేదీలలో నిరంతరం సంగీతం, నృత్యం,  లయవిన్యాసం, భరత నాట్యం, కూచిపూడి, పెరణి, ఒడిస్సి నాట్యం తో శివుడికి నీరాజనం అందించే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Related posts

ఐటి రైడ్:రష్మికామందన్నఇంట్లోఐటి అధికారుల సోదాలు

Satyam NEWS

టెర్రర్: 426 మంది రైతులపై ఏపీ పోలీసుల కేసులు

Satyam NEWS

బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష

Bhavani

Leave a Comment