28.7 C
Hyderabad
April 25, 2024 03: 36 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి ప్రాంతానికి త్వరలో కాళేశ్వరం నీళ్లు

#Minister Vemula Prashanth Reddy

శ్రీరాంసాగర్ నుంచి మంచిప్ప ప్యాకేజి 22 ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ లో నియంత్రిత సాగు విధానంపై సిఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్మానాలు చేసిన గ్రామాల రైతులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏది చెప్పినా రైతుల మంచి కోసం మాత్రమే చెప్తారని ఆయన అన్నారు.

రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తేవాలని కేసీఆర్ రైతుబంధు ప్రారంభించారని, కరోనా ఇబ్బందులు ఉన్నా 12 వందల కోట్ల రైతు రుణాల మాఫీ చేశారని మంత్రి తెలిపారు. 7 వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయించారని ఆయన అన్నారు.

3 సంవత్సరాల కాలంలో 6 వందల మీటర్ల ఎత్తుకు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి వెల్లడించారు. 22 వేల కోట్లు భగీరథ కోసం, 14 వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం కోసం, 80 వేల కోట్లు కాళేశ్వరం పథకానికి ఖర్చు చేశారని ఆయన అన్నారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచారని, వీటన్నిటి ద్వారా పంట విస్తీర్ణం పెరుగుతుందని ఆయన అన్నారు. పంట విస్తీర్ణం పెరిగితే రైతుకు గిట్టుబాటు ధర రావాలని కేసీఆర్ భావించినందుకే నియంత్రిత విధానాన్ని ప్రవేశపెట్టారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ప్రతిపక్షాల వారు ఏం చెయ్యాలో తెలియక పంటల విధానాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు దెబ్బలు తగిలినప్పుడు ఏ ఒక్కనాడైనా మాట్లాడటానికి ముందుకు రాని ఈ నాయకులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Related posts

స్నేహ‌మేరా జీవితం…స్నేహ‌మేరా శాశ్వ‌తం…!

Satyam NEWS

రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలి

Satyam NEWS

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Satyam NEWS

Leave a Comment