39.2 C
Hyderabad
March 28, 2024 17: 12 PM
Slider ఆదిలాబాద్

రెసిడెన్షియ‌ల్  స్కూల్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన మంత్రి అల్లోల‌

#indrakaranreddy

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో  సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  బ‌డి బాట ప‌ట్టారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండ‌లం జాం గ్రామంలోని ప్రభుత్వ  సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ‌నివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

రెసిడెన్షియల్ స్కూల్‌‌లో వంట గ‌ది, భోజ‌న శాల‌, వ‌స‌తి ఇలా  అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల‌కు అందిస్తున్న భోజ‌న వివ‌రాల‌ను, మెనును అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటీవ‌ల ఆహారం క‌లుషిత‌మై  విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్న సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో  వంట గ‌దిలో ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. తాజా కూర‌గాయాలను వండాల‌ని, బియ్యం, గుడ్లు, ఇత‌ర వంట సామాగ్రి ఎక్కువ కాలం నిల్వ ఉంచ‌రాద‌ని  ఆదేశించారు.

ఈ సందర్భంగా విద్యార్థినిల‌తో  ఆయన మాట్లాడారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా.. అని ఆరా తీశారు.  అనంత‌రం విద్యార్థుల‌తో క‌లిసి మంత్రి  భోజ‌నం చేశారు.

Related posts

నవంబర్ 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..

Sub Editor

గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం

Satyam NEWS

(Best) Cbd Hemp Oil 100 Thc Free Does It Work Cbd Infused Vape Juice Bio Nutrition Cbd Hemp Oil 79 1 Oz

Bhavani

Leave a Comment