21.7 C
Hyderabad
December 2, 2023 04: 46 AM
Slider తెలంగాణ

ప్రతి పంటకు మద్ధతు ధర లభిస్తుంది

harish 45

మీ ధాన్యానికి సరైన మద్ధతు ధర ఇస్తాం.! ఇది రైతు ప్రభుత్వం.. రైతే ఈ రాష్టానికి ముఖ్యమంత్రి.! రైతులు వడ్ల కొనుగోలుకు సంబంధించి కొద్దిగా తేమ శాతం తగ్గాక వడ్లను ఆరబెట్టి తేవాలని రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని 116 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.1కోటి 15 లక్షల 35వేల 416 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రెండవ పంట కోసం పల్లి, శనగ విత్తనాలను 35 శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. యాసంగిలో వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు.. ఇలా 5 రకాల విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చామని, వీటిని కిలో రూ.60 రూపాయలు ఉంటే., ప్రభుత్వం సబ్సిడీ పై రూ. రూ.42 రూపాయలకే అందిస్తున్నదని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఆరుతడి పంటలు వేసేలా దృష్టి సారించాలని ఆ దిశగా రైతులను చైతన్యపరుస్తూ.. ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పాత రోజుల్లో కూరగాయల పంటలు పండించాలంటే..ఇబ్బందులు ఉండేవని., ఇప్పుడా పరిస్థితి కూడా లేదని.. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా ఉందని భరోసాను ఇచ్చారు. మొక్కజొన్న రైతులకు రూ.1760 రూపాయలు మద్ధతు ధర ఉన్నదని., అవసరమైతే.. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని చోట్లా యధావిధిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలుకు రూ.1835 రూపాయల మద్ధతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. పత్తి మద్ధతు ధర రూ. 5550 రూపాయలు, పత్తి రైతులు దీనిని వినియోగించుకోవాలని మంత్రి అన్నారు

Related posts

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన కార్యక్రమం

Satyam NEWS

అంతా రామమయం: ఒంటిమిట్ట కోదండరామస్వామి

Satyam NEWS

అభివృద్ధి కోసం గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ వరకు పోరాడతాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!