28.2 C
Hyderabad
March 27, 2023 11: 45 AM
Slider తెలంగాణ

నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వండి

yerrabelly

గ్రామాల సమగ్ర అభివృధి కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కు మంత్రి లేఖ అందజేశారు. రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను, కార్యక్రమాలను వివరించారు. స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని, పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా తెచ్చిన  కొత్త చట్టంలో ప్రకారం 4 వేలకు పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి అని వివరించారు. అన్ని గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాల్సి ఉందని, దశల వారీగా రాష్ట్రానికి ఎక్కువ జీపీ భవనాల అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే మంజూరైన 200 జిపీ భవనాలకు అదనంగా మరో 200 భవనాలను మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం హరిత హారం, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. 14 వ ఫైనాన్స్ కమిషన్ పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద 254.74 కోట్లు త్వరగా  విడుదల చెయ్యాలని, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) మొదటి విడతగా 52.55 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదల చెయ్యాలని మంత్రి కోరారు.

Related posts

మానేరు రివర్ ఫ్రంట్ కు మహర్దశ

Satyam NEWS

కార్యాలయాల తరలింపుపై మరో రెండు పిటీషన్లు

Satyam NEWS

టీడీపీ కార్యకర్త పై వైసీపీ రౌడీ మూకలు దారికాచి దాడి

Bhavani

Leave a Comment

error: Content is protected !!