33.2 C
Hyderabad
April 26, 2024 00: 40 AM
Slider వరంగల్

రెవెన్యూ బిల్లు ఆమోదం పట్ల మంత్రుల హర్షం

#TelanganaMinisters

ముఖ్యమంత్రి కేసిఆర్ రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారంగా ఈ చట్టం రావడం సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

 ముఖ్యమంత్రి కి రైతులు, గిరిజనుల, దళితుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. భూముల విషయంలో వి. ఆర్. ఓ  అధికారాలు దుర్వినియోగం కావడం,  కొంత మంది వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వాటికి పరిష్కారంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ చట్టం తెచ్చారు.

ఈ చట్టం తేవడం పట్ల వల్ల రైతులు, ప్రజలు సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. వి.ఆర్. ఓ వ్యవస్థ రద్దు చేసి, వారిని ప్రభుత్వ శాఖల్లో  తీసుకుంటాం అనడం, ఎక్కువగా దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఉన్న వి.అర్. ఏ లను కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటామని హామీ ఇవ్వడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు.

పోడు భూముల సమస్య కూడా పరిష్కారం స్వయంగా చేస్తానని, వారికి రైతు బంధు కూడా ఇస్తామనిచెప్పడం పట్ల గిరిజన బిడ్డగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్లు మంత్రి అన్నారు.

Related posts

స్టూడెంట్స్ మిస్:లేఖ రాసి మరి వెళ్లిపోయారు

Satyam NEWS

నేరస్తులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలి

Bhavani

అరవింద్ కాటన్ మాస్కుల అందజేత

Sub Editor

Leave a Comment