35.2 C
Hyderabad
April 20, 2024 17: 45 PM
Slider తెలంగాణ

పవిత్ర కార్తీకమాసంలో చేయరాని పని చేసిన మంత్రి

minister 21

పవిత్రమైన కార్తీక మాసం. శివుడికి విష్ణువుకు కూడా అత్యంత పవిత్రమైన రోజులు ఇవి. ఎంతో మంది భక్తితో కార్తీక మాసం అంతా శైవ క్షేత్రాలకు వెళుతుంటారు. సోమశిలలో లలితా సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అదే విధంగా శ్రీశైలం. అక్కడ భ్రమరాంబా మల్లిఖార్జునుడు కొలువై ఉన్నాడు. భ్రమరాంబా మల్లికార్జునుడు జ్యోతిర్లింగం. లలితా సోమేశ్వరుడు ఏడో శతాబ్దం నుంచి కొలువై ఉన్న ఏలిక. ఈ ఇద్దరిని కలిపేది పవిత్ర కృష్ణానది. ఈ రెండు పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణ టూరిజం బోట్లు ఏర్పాటు చేసింది. ఈ బోటింగ్ ను రాష్ట్ర  టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి  నారాయణరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించేందుకు వచ్చారు. వచ్చారు, బోటింగ్ ప్రారంభించారు. ఇందులో విశేషం ఎముంది అనుకుంటున్నారా? చాల విశేషం ఉంది మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బోటింగ్ కు స్విచ్ ఆన్ చేశారు. బోటులో ఎక్కి కృష్ణానదీ అందాలను తిలకించారు. నదిలో ప్రయాణం, అడవి అందాలు… హాయిగా విహరించారు. మరి ఇంత ఆనంద సమయంలో చికెన్ లేకపోతే ఎలా? చక్కగా మాంసాహారంతో కూడిన వంటకాలతో అందరూ భోజనం చేశారు. సాయంత్రం సింగోటం గ్రామం లో హరిత రెస్టారెంట్ కాటేజీలను, బోటింగ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ బృందం అందరూ కలిసి వెళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పుష్టిగా మాంసం తిని కనీసం స్నానం కూడా చేయకుండా అదీ కూడా అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి ఒక మంత్రి, ఎమ్మెల్యే ఎలా  ప్రవేశిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాంసాహారం తిని ఆలయంలోకి వెళ్లడమే కాకుండా అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలకు ఆచార వ్యవహారాలకు ప్రధమ ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయం వెళితే కొంపలు మునుగుతాయని ఈ నాయకుల అనుచరులు బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లిందని కూడా అంటున్నారు.

Related posts

గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్‌ వినిపించాలి

Satyam NEWS

ఈ సారి పోలీసు “స్పందన” ప్రత్యేకంగా…!

Satyam NEWS

పెంచుతున్న పన్నుల సొమ్ము అంతా సొంత పత్రికకే

Satyam NEWS

Leave a Comment