28.2 C
Hyderabad
April 20, 2024 14: 11 PM
Slider విజయనగరం

త‌ప్పిపోయిన అయిదేళ్ల బాలుడు….మూడు గంట‌ల్లో అమ్మ ఒడికి

#SP Rajakumari

అది ఏపీలోని విద్య‌ల‌ న‌గ‌రంగా ఖ్యాతి పొందిన విజ‌య‌న‌గ‌రం. క‌రోనా నేప‌ధ్యంలో జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ సాయంత్రం అయిదున్న‌ర గంట‌ల‌కు న‌గ‌రంలోని బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఆరు అయ్యేస‌రికి ఏ ఒక్క‌రూ రోడ్ మీద ఉండ‌కూడ‌దంటూ  అక్క‌డే విధులు నిర్వ‌హిస్తున్న సీసీఎస్ సీఐ కాంతారావు,ఎస్ఐ ర‌విలతో ఎస్పీ చెప్పిస్తున్నారు.

అంత‌లోనే ఎస్పీ మేడం వ‌చ్చార‌ని తెలుసుకున్న ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు ప‌రుగు ప‌రుగున వ‌చ్చారు. స‌రిగ్గా ఆ క్ష‌ణంలోనే ఎస్పీ మేడం వ‌ద్ద కు..చేతికున్న క‌ట్టుతో ఒకరు..అత‌నికి తోడు మ‌రొక‌రు వ‌చ్చి ఏదో ఫిర్యాదు చేసారు.

ఇక ఆ స‌మ‌యంలోనే క‌ర్ఫ్యూ  మొద‌ల‌వుతుంద‌ని తెలుసుకున్న స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి అదే జంక్ష‌న్ లో ఎస్పీ  త‌న సిబ్బందితో నిర్వ‌హిస్తున్న వైనాన్ని చిత్ర‌క‌రిస్తుండ‌గానే ఎస్పీ… త‌న‌ను క‌లిసిన వ్య‌క్తి నుంచీ స‌మాచారం తెలుసుకుని..ఫోన్ లో పీడ్ చేసుకోవడం క‌నిపించింది. వెంట‌నే స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిది ఏంటని ప్ర‌శ్నిస్తే  అయిదేళ్ల బాలుడు పేరు హేమంత్ అదృశ్య‌మ‌య్యాడ‌ని ఫిర్యాదు…!.

ఆప‌ద కోసం ఎవ‌రు వ‌చ్చిన క్ష‌ణాల‌లో సాయం చేసేందుకు వెన‌కాడని ఎస్పీరాజ‌కుమారి మ‌రుక్ష‌ణం….ఫోన్ లో అదీ వాట్సాప్ లో వివ‌రాలు నోట్ చేసుకుని పీఆర్వో ద్వారా మీడియాకు స్ర్కోలింగ్ ఇవ్వాలంటూ స‌మాచారం పెట్టారు.అక్క‌డితో ఎస్పీ చ‌ర్య‌లు ఆగ‌లేదు. త‌క్ష‌ణం మేన్ ప్యాక్ ద్వారా సిబ్బందిని మొత్తం అలెర్ట్ చేసారు.

ఓ వైపు వాట్సాప్ ద్వారా బాబు ఫోటో ను షేర్ చెయ్య‌డం మ‌రోవైపు మేన్ ప్యాక్ ద్వారా సిబ్బందిని అలెర్ట్ చేసారు…ఎస్పీ రాజ‌కుమారీ.స‌రిగ్గా బాలుడు తండ్రి సీత‌య్య‌కు ఫోన్…బాబు దొరికాడ‌ని స‌మాచారం. ఇక ఆ తండ్రి ముఖంలో  ఆనందానికి అవ‌ధులు లేవు.

విష‌యం విన్నవెంట‌నే ఎస్పీ రాజ‌క‌మారీ స‌హితం..హ‌మ‌య్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే..బాబును తీసుకు రావాలంటూ డీఎస్పీ అనిల్ ను ఆదేశించారు.అలాగే బాబు క‌న్న‌తల్లిని కూడా బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని క‌బురు పంపారు. ఒకేసారి అటు క‌న్న‌త‌ల్లి…ఇటు బాబును తీసురావ‌డంతో  అక్క‌డున్న పోలీసుల ముఖాల‌లో ఆనందం వెల్లి విరిసింది.

ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉన్న స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధికే తొలుత వీడియో బైట్ ఇచ్చారు..ఎస్పీ. చీపురుప‌ల్లికి చెందిన సీత‌య్య గంగ‌మ్మ‌ల గారాల ప‌ట్టి అయిదేళ్ల హేమంత్.అమ్మ‌,నాన్న‌ల‌తో న‌గ‌రంలోని కాట వీధిలో ఉంటున్న మేన‌మామ ల‌క్ష్మ‌ణ యాద‌వ్ ఇంటికి వ‌చ్చారు. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల ప్రాంతంలో ఆడుకోవ‌డానిక‌ని బ‌య‌ట‌కు వెళ్లిన అయిదేళ్ల హేమంత్ తిరిగి  ఇంటిని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు.

వెళుతూవెళుతూ స‌మీపంలోని ఘోష హాస్ప‌ట‌ల్ వ‌ద్ద‌కు వెళ్లిపోయాడు. అక్క‌డే బాబును చూసిన హాస్ప‌ట‌ల్ లోని శానిట‌రీ సిబ్బంది ఇద్ద‌రు చిరునామ‌,ఎక్క‌డ‌.. పేరేంటి..?అమ్మ‌,నాన్న‌లెవ‌రు అని అడ‌గ‌గా..త‌న పేరు హేమంత్ అని తండ్రి సీత‌య్య,త‌ల్లి  గంగ‌మ్మ అంటూ చెప్ప‌డంతో  ఆ బాబును ప‌ట్టుకుని క‌న్న‌వాళ్ల‌ను వారు  ఉంటున్న ఇంటిని వెత‌క‌డం ప్రారంభించారు.

అంత‌లోనే బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద  త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న ఎస్పీకి  ఆ బాబు మేన‌మామ‌,తండ్రి ఫిర్యాదు చేయ‌డం..అదే స‌మ‌యంలో కాట వీధి నుంచీ త‌ల్లి ని ర‌ప్పించ‌డం…అ స‌మ‌యంలోనే టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ రావు బాబును తీసుకుని క‌న్న‌త‌ల్లికి అప్ప‌గించ‌డంతో త‌ప్పిపోయిన బాబు క‌థ సుఖాంతం అయింది.

మూడు గంట‌ల‌లో త‌ప్పిపోయిన బాబును క‌న్న‌తల్లి ఒడికి చేర్చిన  పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఖాకీల‌లో క‌ఠ‌వుద‌నంతో పాటు కాపాడే మ‌న‌స్త‌త్వం కూడా ఉంటుంద‌ని చూపించిన విజ‌య‌న‌గ‌రం పోలీసులకు హేట్సాప్ చెబుతోంది…స‌త్యం న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Satyam NEWS

ఏప్రిల్ 14 నుండి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తి

Satyam NEWS

డేటా రైట్:మానవ హక్కులు గా డేటా ప్రైవసీ

Satyam NEWS

Leave a Comment