27.7 C
Hyderabad
April 20, 2024 01: 31 AM
Slider ఆదిలాబాద్

మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్న AHTU బృందాలు

#ZP Highschool Adilabad

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మానవుల అక్రమ రవాణా వ్యవస్థను నియంత్రించడానికి, ముందస్తుగా గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిసిఎస్ సిఐ ఈ. చంద్రమౌళి పేర్కొన్నారు. బుధవారం తలమడుగు మండల కేంద్రంలో షీటీం సభ్యులతో కలిసి యువతీ యువకులు, ప్రజలు మహిళలు, విద్యార్థినీ విద్యార్థులకు సమాజంలోని వ్యవస్థీకృత నేరాలపై చైతన్య కార్యక్రమం చేపట్టారు.

మానవ అక్రమ రవాణా, కిడ్నాపింగ్, వ్యభిచారం, మహిళల అపహరణ, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు తదితర అంశాలపై విస్తారంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, పూర్తి అవగాహనతోనే నేరాల బారినపడకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుందన్నారు.

విద్యార్థినీ విద్యార్థులల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు, ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఉమెన్ సేఫ్టీ వింగ్ శాఖ పనిచేస్తుందన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యక బృందం పనిచేస్తుందన్నారు.

మహిళా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులకు గురైనప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసేలా వారిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఐజి స్వాతి లక్రా, రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజి బి సుమతి, నేతృత్వంలో జిల్లాలో ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పనిచేస్తుందని తెలిపారు.

ఎస్పి ఎం రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రెండు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, స్త్రీ పురుషులు గుమికూడే బహిరంగ స్థలాల్లో ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపులకు అరికట్టడానికి నేరస్తుల ఆయా చర్యలను గూడచారి వేషంలో ఉన్న షీటీమ్స్ రహస్య కెమెరాల్లో సాక్ష్యంగా బంధించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ చర్యలతో జిల్లాలో వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు.

సామాజిక పరిస్థితుల వల్ల కొందరు మహిళలను వ్యభిచారంలోకి వెళ్ళేలా చేస్తున్నాయని, ఆ పరిస్థితుల వెనుక ఎవరున్నారు అనేది పరిశోధించి వారికి శిక్షించడంతో ఇలాంటి చర్యలకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, రాణించాలని పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు,

షీ టీమ్స్ కు చెందిన పోలీసులు ఎల్లప్పుడు ప్రధాన కూడలి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ ఉంటారని, అమ్మాయిలు ఏ సమయంలోనైనా సరే తాము ఆపదలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, ఆకతాయిలు వెంట పడినట్లు గ్రహిస్తే వెంటనే తాము ఉన్న ప్రదేశాన్ని డయల్-100 ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని ఆకతాయిల ఆట కట్టించి, వారిని అదుపులో తీసుకొని బాధితులకు రక్షణగా ఉంటారని తెలిపారు.

ఈ సమావేశంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, షీ టీం ఇంచార్జ్ ఏఎస్సై ఈ. సునీత, సభ్యులు ఠాకూర్ జగన్ సింగ్, సుశీల, సంతోష్, ఉపాధ్యాయులు ఎన్.నగేష్, గంగమ్మ, మహిళలు, ప్రజలు, యువకులు, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జంపన్న వాగు వరద బాధితులకు సీతక్క సాయం

Satyam NEWS

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

రేవంత్ రెడ్డి ఓ బచ్చా: హోంమంత్రి మహమూద్ అలీ

Satyam NEWS

Leave a Comment