29.2 C
Hyderabad
September 10, 2024 15: 15 PM
Slider తెలంగాణ సినిమా

మిస్టేక్ – ఒక తప్పు థ్రిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధం

mistake

ప్రవాస తెలంగాణ వాసులు, సంతోష్ చరణ్ దర్శకుడిగా, వికాస్ దేవరకొండ సినిమాటోగ్రాఫర్ గా న్యూ జీల్యాండ్  లో మిస్టేక్ – ఒక తప్పు అనే థ్రిల్లర్  English చిత్రం తెరకెక్కింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్  శరవేగంగా జరుపుకొని  న్యూ జీల్యాండ్, ఫిజి దేశాలలో డిసెంబర్ నెల మొదటి వారంలో  విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం లో  న్యూ జీల్యాండ్, ఫిజి నటి, నటులు ముఖ్య భూమికలు పోషించారు. ఒక ఆగంతకుడు/ఉన్మాది , ఒక మహిళ ఇంట్లోకి చొరబడి, ఆమెను భయ భ్రాంతులకు గురి చేసి బంధిస్తాడు. అనంతరం మహిళా ఎలా ఉన్మాది పైన పోరాటం చేసి ప్రాణాలు కాపాడుకుంటుందనే కథాంశం తో ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు  గురి చేసే విధంగా  రూపొందించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర సంగీత దర్శకుడిగా విజయ్ కురకాల వ్యవహరిస్తున్నారు. ఈ రోజు  ఈ చిత్రానికి సంబందించిన టీజర్ విడుదల అయ్యింది. చిత్ర దర్శకుడు  సంతోష్ చరణ్ ప్రస్తుతం ఒక భారతీయ ఛానల్ క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా, పలు లఘు చిత్రాలు, Punjabi మ్యూజిక్ ఆల్బమ్స్, వాణిజ్య ప్రకటనలు, రియాలిటీ షోస్ కు దర్శకత్వం వహించి మంచి పేరు పొందారు. ఆలాగే వికాస్ దేవరకొండ సినిమాటోగ్రాఫర్ గా, పలు వాణిజ్య ప్రకటన లు రూపొందించారు. ఈ చిత్రం తో ఎలాగైనా మంచి విజయం పొంది తమ  ప్రతిభ కు గుర్తింపు దక్కుతుందని  ఆశిస్తున్నారు.

Related posts

అంగన్‌వాడీలకు పోషన్ అభియాన్ శిక్షణ

Satyam NEWS

కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త

Murali Krishna

రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే కష్టపడాలి

Satyam NEWS

Leave a Comment