పేద కూలి కుటుంబానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండగా నిలిచారు. మొండురు లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై బుడపన శ్రీను (40) మృతి చెందాడు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను చింతమనేని ఓదార్చారు. వ్యవసాయ పనులు ముగించుకుని వస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై బుడపన శ్రీను అనే పేద కూలి మృతి చెందాడు. అతను పెదవేగి మండలం మొండురు గ్రామానికి చెందిన వడు. శ్రీను కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
శ్రీను అకాల మరణంతో దిక్కు తోచని స్థితిలో అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏలూరులోని శవ పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీగా జీవిస్తూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం క్రియాశీల కార్యకర్తగా ఎంతో సేవలు అందించిన వ్యక్తి శ్రీను అకాల మరణం బాధాకరం. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం.
తెలుగుదేశం పార్టీ లో సభ్యత్వం ఉండటం వల్ల శ్రీను కు వర్తించే రూ.5లక్షల ప్రమాద భీమా సొమ్మును, ప్రభుత్వం నుంచి కూడా అందాల్సిన సంక్షేమాన్ని కూడా సత్వరమే శ్రీను కుటుంబానికి అందించేలా చర్యలు చేపడతామని, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే తొలి ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నమని, అటువంటి ఏ కార్యకర్త కుటుంబానికి కష్టం వచ్చినా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.