మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తరపున నరసరావుపేట పట్టణంలో చేపట్టబోయే పనులను శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేడు పరిశీలించారు. మరికొద్ది రోజుల్లో రాబోతున్న మహాశివరాత్రి కోడప్పకొండలో ఘనంగా జరిగే విషయం తెలిసిందే.
మహా శివరాత్రి పండుగ, కోటప్పకొండ జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చెయ్యాలని అన్నారు. మున్సిపాలిటీ వారు ఎక్కడ శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని కొండకు వచ్చే భక్తులకు మంచి నీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి శివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావలని కోరారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.