40.2 C
Hyderabad
April 24, 2024 18: 14 PM
Slider హైదరాబాద్

ఇండియన్ రికార్డుల్లోకి ఎక్కిన రక్తదాన శిబిరం

#Blood Donation camp

రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిర్వహించిన రక్తదాన శిబిరం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. కరోనా సమయంలో ఒక రోజులో అత్యధికంగా 2216 మంది రక్త దానం చేసిన ఈ కార్యక్రమాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసి ఈ మేరకు ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు.

మంత్రి కేటీఆర్ జన్మ దినం సందర్భంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వివిధ డివిజన్లకు చెందిన 2216 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, దాతలు రక్తదానం చేశారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలో 867 మంది రక్తదానం చేసిన రికార్డు ఉంది. దాన్ని మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం అధిగమించింది.

మంత్రి తలసాని నివాస యాదవ్ సమక్షంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించినట్లు సర్టిఫికెట్ తో బాటు మెడల్ ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సంస్థ ప్రతినిధి వసుధ అశోక్ అందచేశారు.

Related posts

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు: సీఎం

Satyam NEWS

కోనసీమ లో విధ్వంస ఘటనల వెనుక అరాచక  శక్తులు

Satyam NEWS

కొత్త ఏడాదిలో గ్యాస్ ధరలపై కేంద్రం షాక్

Sub Editor

Leave a Comment