26.1 C
Hyderabad
May 15, 2021 04: 21 AM
Slider చిత్తూరు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రోజా గొంతు వినిపించదా?

#MLARoja

ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది.

సినీ నటిగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఇప్పుడు చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా అప్రతిహత విజయం సాధించి ఉన్నారు.

ఏ అవకాశం వచ్చినా ప్రచారానికి రోజాను వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. రోజా ఎన్నికల ప్రచారం చేస్తే బాగుంటుందని వైసీపీ నేతలు చాలా మంది అభిప్రాయపడుతుంటారు కూడా.

అయితే అనూహ్యంగా ఆమె సొంత జిల్లా అయిన చిత్తూరులో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతుంటే రోజా ప్రచారానికి రావడం లేదు. ఆమె రెండు మేజర్ ఆపరేషన్లు చేయించుకుని రెస్టు తీసుకుంటున్నారని సమాచారం ఉన్నప్పటికీ ఆమె లేని లోటు ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తున్నది.

చిత్తూరు జిల్లాలో రోజాను అణచి వేసేందుకు అక్కడి ‘‘పెద్దరెడ్లు’’ పలు రకాల కుట్రలు పన్నుతున్నారు. నగరి, పుత్తూరు మునిసిపాలిటీలలో తిరుగుబాటు అభ్యర్ధుల్ని నిలబెట్టి రోజా అధికారికంగా మద్దతు ఇచ్చిన వైసీపీ అభ్యర్ధులను ఓడించేందుకు కూడా కుట్ర పన్నారు.

అయితే అదృష్టవశాత్తూ రోజా నిలబెట్టిన వైసీపీ అధికారిక అభ్యర్ధులే గెలిచారు. రాజకీయంగా రోజాను ఒంటరిని చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ నేతలపై ఇప్పటికే రోజా ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు.

అయినా అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ లోపు వచ్చిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక మొత్తం ఆ జిల్లాకు చెందిన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. దాంతో రోజాకు అక్కడ స్థానం లేకుండా పోయింది.

దాంతో రోజాను ఎవరూ ప్రచారానికి పిలవలేదు. ఈ విషయం ముందుగానే గ్రహించినందువల్లనేమో రోజా గత రెండు సంవత్సరాలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న శస్త్ర చికిత్సలను ఇప్పుడు చేయించుకుని రెస్టు తీసుకుంటున్నారు.  

Related posts

ఎబాలిషన్: త్వరలో వై ఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం

Satyam NEWS

మొదలైన మేడారం వనదేవతల దర్శనం..

Sub Editor

వాట్సాప్ ద్వారా నీట్,జేఈఈ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!