40.2 C
Hyderabad
April 19, 2024 15: 10 PM
Slider ప్రత్యేకం

మిషన్ పై స్టూడెంట్ యూనిఫాం కుట్టిన టైలర్ రోజా

#mlaroja

స్టూడెంట్ యూనిఫాం ను టైలర్ కుడితే పెద్ద విశేషం ఏమీ కాకపోవచ్చు కానీ ఎమ్మెల్యే కుడితే? అదే ఇప్పటి వార్త. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా స్టూడెంట్ యూనిఫారం ను చక చకా కుట్టేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

నగరి నియోజకవర్గంలోని ఏకాంబర కండ్రిగ ప్రాంతంలోని ఒక స్కూలును నేడు ఆమె సందర్శించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆ స్కూల్ లో కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో భాగంగా విద్యార్ధినులకు అక్కడ కుట్టు పని నేర్పిస్తారన్నమాట.

ఈ కేంద్రాన్ని ప్రారంభించిన రోజా అంతటితో ఆగకుండా కుట్టు మిషన్ పైన కూర్చుని స్టూడెంట్ కు యూనిఫారం కుట్టేశారు. ఏ పని చేసినా సంచలనాత్మకంగా చేసే ఎమ్మెల్యే రోజా చేసిన ఈ పని కూడా వైరల్ గా మారింది. అంతకు ముందు ఎమ్మెల్యే రోజాకు పూలు చల్లి మరీ అక్కడి విద్యార్థినులు స్వాగతం పలికారు.

Related posts

జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులు

Satyam NEWS

సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం

Satyam NEWS

పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా స్వాధీనం

Satyam NEWS

Leave a Comment