సీనియర్ జర్నలిస్ట్ నేతాజీ కొడియార్ వివాహ రిసెప్షన్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. జాతీయ మీడియా ఛానెల్ జీ హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న నేతాజీ కొడియార్ వివాహం ఈనెల 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ సాయి రంగ కళ్యాణ మండపంలో జరిగింది.
మంగళవారం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు ఎమ్మెల్యే సీతక్క హాజరై వధూవరులు నేతాజీ, ఉషా శిరీషలను ఆశీర్వదించారు. ఓవైపు మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు వద్దని వారించినా ఆమె తన గన్‌మెన్‌లను పక్కన పెట్టి ఆమె ఈ వేడుకకు హాజరయ్యారు.
ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, మండల అధ్యక్షులు అనంత రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజఫర్, అర్రెం లచ్చు పటేల్, మావూరపు తిరుపతి రెడ్డి, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.