చిరు వ్యాపారులకు ఇబ్బంది కలిగించిన సిర్పూర్ పేపర్ మిల్స్ యాజమాన్యంపై కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.
కాగజ్ నగర్ పట్టణంలోని లారీ చౌరస్తా వద్ద కొందరు చిరు వ్యాపారస్తులు జీవనోపాథి పొందుతుండే వారు. అయితే ఎస్పీఎం యాజమాన్యం అక్కడ నుంచి వారి షాపులను తొలగించింది. దాంతో తమకు జీవనోపాథి దూరం అయిందని వారు వాపోయారు.
కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి చిరువ్యాపారులు తమ గోడు వెలిబుచ్చారు. దాంతో ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఎస్పీయం అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం చిరువ్యాపారులకు లారీ చౌరస్తాలోనే దుకాణాలు పెట్టుకునేందుకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.