27.7 C
Hyderabad
April 26, 2024 05: 23 AM
Slider విజయనగరం

గ్రామ స‌చివాల‌య కార్య‌ద‌ర్శిల‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే వార్నింగ్….!

#Kolagatla

గ్రామ సచివాల‌య కార్య‌ద‌ర్శుల‌కు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డంపై విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గట్ల వీర‌భ‌ద్ర స్వామి అస‌హ‌నానికి గుర‌య్యారు.గ‌త రెండు రోజులుగా జ‌గ‌నన్న పచ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మంలో భాగంగా న‌గ‌రంలో ప‌లు డివిజ‌న్ ల‌లో వైఎస్ఆర్సీసీ ఉత్త‌రాంధ్ర క‌న్వీన‌ర్, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి  మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతునే ఉన్నారు.

ఈ మేర‌కు అట‌వీ శాఖ సోష‌ల్ ఫారెస్ట్ డివిజ‌న్ అధికారి జాన‌కీ రామ్..డీఎఫ్ఓ  ఆదేశాల‌తో  ప్రొగ్రామ్ ఖ‌రారు చేసారు కూడ‌.అటు న‌గ‌ర పాల‌క సంస్థ కూడా మొత్తం 50 డివిజ‌న్ ల‌లో దాదాపు 100 రోజుల పాటు మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తున్నారు.

తాజాగా న‌గ‌రంలోన బొడెం బంగ్లా  రాజీవ్ న‌గ‌ర్ కాల‌నీలో మేయ‌ర్, వీ.విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ శ్రావ‌ణి, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల లు సంయుక్తంగా   దాదాపు 30 మొక్క‌ల‌ను నాటారు. ఈ సంద‌ర్బంగా స్తానిక స‌చివాల‌య కార్య‌ద‌ర్శిలెవ్వ‌రూ హాజ‌రు కాక‌పోవిడంతో ఎమ్మెల్యే కోల‌గట్ల వారిపై ఆగ్ర‌హం  వ్య‌క్తం చేసారు.

నెల‌కు 15 వేల  జీతం ఇస్తూ…ప్ర‌భుత్వం ఉద్యోగం వ‌చ్చిన మీకు..ప‌ని చేయాడానికి ఎందుకు వెన‌కాడుతున్నార‌ని  కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జల కోసం, ప్ర‌జా సంక్షేమ కోసం ప‌ని చేస్తున్న‌ప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగిగా మీరెందుకు ప‌ని చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఉద్యోగం రాక ఇన్నాళ్లు ఇబ్బంది,ఆవేద‌న ప‌డిన మీరు తీరా  వ‌చ్చాకా ప్ర‌జల‌కు కోసం  ప‌ని చేసేందుకు వెన‌క‌డుగు వేయ‌డానికి కార‌ణం ఏంట‌ని ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే నే స్వ‌యంగా పూనుకుని   రాజీవ్ న‌గ‌ర్ రొడ్డ్ కు ఇరువైపుల మొక్క‌ల‌ను నాటారు.

అలాగే మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ కూడా మొక్క‌లు నాటారు. కొస‌మెరుపు ఏంటంటే కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేర‌సేందుకు వ‌చ్చిన మీడియా ను కూడా ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల మొక్క‌లు నాటాల‌ని కోర‌డంతో వార్తావ‌ళి ప్ర‌తినిధి  నాటిన మొక్క‌కు గెత్తం వేసి.నీళ్లు పోసి బాగా పెరిగిన  నీడ‌ను ఆక్సిజ‌న్ ను ఇవ్వాల‌ని కోరుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పీఆర్ఓ శంక‌ర్, మున్సిప‌ల్ క‌మీష‌న్ వ‌ర్మ‌, ప్రజారోగ్య శాఖ అధికారి,అట‌వీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప‌ని చేసిన కంపెనీలో దొంగ‌త‌నం..ఏడాది నుంచీ జ‌రుగుతున్న చోరీ

Satyam NEWS

ములుగు పంచాయితీకి వికాస్ పురస్కారం

Satyam NEWS

క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -2 విజేతలకు మెమొంటోలు

Satyam NEWS

Leave a Comment