33.2 C
Hyderabad
April 26, 2024 02: 14 AM
Slider వరంగల్

ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి

#MuluguJAC

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు.

ప్రక్క ప్రాంతాలైన పరకాల, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి ప్రాంతాలలో బస్సు డిపో లు ఉన్నాయి కానీ ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

ఇది నేషనల్ హైవే రోడ్డు ప్రాంతం ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేరు? గిరిజన యూనివర్సిటీ పేపర్ల వరకే పరిమితం ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రం గా కూడా ప్రకటించాలని ఆయన అన్నారు.

అదే విధంగా మల్లంపల్లి, రాజుపేట లను మండలాలుగా ప్రకటించాలని, కమలాపూర్ ఫ్యాక్టరీ తెరిపించి వేలాదిమంది కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ ములుగు జిల్లా లోని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థులు హామీ ఇవ్వాలని బిక్షపతి గౌడు డిమాండ్ చేశారు.

ఇప్పటికే ములుగు వెనకబడ్డ ప్రాంతం అయిందని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం రాజకీయ నాయకుల అసమర్థత వల్ల మళ్లీ ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కలువల సంజీవ, కవ్వం పెళ్లి సారయ్య, మాట్ల కూర్మయ్య, తిరుపతి, రవి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దు

Satyam NEWS

కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం

Bhavani

రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు జయప్రదం చేయండి.

Bhavani

Leave a Comment