27.7 C
Hyderabad
April 24, 2024 10: 32 AM
Slider నల్గొండ

ఈనాటి నిరుద్యోగులే రేపటి ఉద్యోగులు కావాలి

#MLCelections

నాయకులు,పౌరులు, చదువుకున్న పట్టభద్రులు నిరక్షరాస్యుల వారి లాగా మోసపోవద్దని, ఆలోచించి ఈ నెల 14న, జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయసారధిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జిల్లా CITU  ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రాములు ‘ఎమ్మెల్సీ ఓట్ ఫర్ రైట్’ అనే నినాదంతో ఆయన ముందుకు వచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ  పరిధిలోని మాధవరాయనిగూడెం లోని బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారంలో భాగంగా రోషపతి, రాములు మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా కష్టపడ్డారో ఉభయ మిత్రపక్షాలు బలపర్చిన  జయసారధిరెడ్డి గెలుపు కోసం నిరుద్యోగులు, అన్ని రంగాలలోని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

విభజన చట్టం హక్కులని సాధించుకుందాం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్,ములుగు లో గిరిజన యూనివర్సిటీ స్థాపించాలని, వాటి సాధనకు అందరు సహకరించి గెలిపించాలని కోరారు. నాయకులు చెప్పే మాయ మాటల్లో పడొద్దని పదే పదే ప్రచారంలో భాగంగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జక్కుల వెంకటేశ్వర్లు, చిన్న వీరమల్లు, సిఐటియు నాయకులు ఎలక సోమయ్య గౌడ్, లక్ష్మీమల్ల నరసింహ, రాయలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతోంది

Bhavani

ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Satyam NEWS

ఆర్యన్‌ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖెడే అవుట్‌

Sub Editor

Leave a Comment