34.2 C
Hyderabad
April 23, 2024 14: 14 PM
Slider మహబూబ్ నగర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీసీ లకు కేటాయించాలి

#WanaparthyBCleaders

ఫిబ్రవరి 2021లో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానానికి విద్యావంతులైన టువంటి బీసీ యువతకు బిసి యువతకు పోటీ చేసే అవకాశం అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి కురుమూర్తి డిమాండ్ చేశారు.

వనపర్తి జిల్లా అధ్యక్షుడు  గుంటి కురుమూర్తి అధ్యక్షతన  వనపర్తిలో జిల్లా కమిటీ విస్తృత సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి  ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  అడ్వకేట్  మోహన్ కుమార్ యాదవ్   హాజరయ్యారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ పార్టీలైన టువంటి కాంగ్రెస్, బిజెపి, సిపిఎం,సిపిఐ, రాష్ట్ర పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీలు విద్యావంతులైన సామాజిక వర్గానికి చెందిన యువతకు పోటీ చేసే అవకాశం కల్పించి ఓట్లు వేసి గెలిపించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎస్సీ ఎస్టీ బిసి సామాజిక తరగతులకు చెందిన వారు అత్యధిక సంఖ్యలో విద్యాధికులైన టువంటి యువకులు యూనివర్సిటీ స్థాయిలో ఉద్యమాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చినా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో గాని, సంక్షేమ రంగంలో గాని,ఎస్సీ,ఎస్టీ,బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పని చేసినటువంటి వారు 6 అత్యధికంగా రాజకీయ రంగంలో పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. జనాభాలో దాదాపుగా 52% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని అన్నారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన నేటి పన్నెండు వందల మంది విద్యార్థులలో 1100 మంది విద్యార్థులు సామాజిక వర్గానికి చెందిన వారే ఆత్మబలిదానం చేసుకున్నారని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ వర్గాలకు మొండి చెయ్యి చూపారని వాపోయారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎ. బాలరాజు నాయుడు, సాయి కృష్ణ గౌడ్, యుగంధర్, గోకం మధు, కార్తీక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

స్వామీజీ అనుగ్రహంతో అమెరికా పర్యటన దిగ్విజయంగా పూర్తి

Satyam NEWS

యాగ్రీ టేబెల్: చిన్న దడిగి లో రైతు అవగాహన సదస్సు

Satyam NEWS

కరోనా కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment