37.2 C
Hyderabad
March 28, 2024 19: 40 PM
Slider మెదక్

సిద్దిపేట సిగలో మరో కలికితురాయి…

#Harishrao

సిద్ధిపేట పాత బస్టాండ్ ను మోడల్ బస్టాండ్ గా చేస్తునట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట పాత బస్టాండ్ నిర్మాణం జరిగి 50 ఏళ్ళు అవుతుందని, అంత చరిత్ర కలిగిన పాత బస్టాండ్ ను మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం బస్టాండ్ శిథిలావస్థకు చేరిందని , ఎప్పుడు క్రుంగి కూలి పోతుందో తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మోడల్ గా నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకు 6 కోట్లు అవసరం అవుతున్న నేపథ్యంలో 3 కోట్లు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ (సి ఎస్ ఆర్ ) నిధుల ద్వారా మంజూరు అయ్యాయని మంత్రి చెప్పారు.

మరో మూడు కోట్లు ఇతర నిధుల నుండి మోడల్ బస్టాండ్ గా పునర్నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ ను పూర్తి స్థాయి లో తొలగించి మోడల్ గా నిర్మిస్తామని చెప్పారు. ఆధునాతన హంగులతో, సకల సౌకర్యాల తో, తక్కువ స్థలం లో అన్ని సౌకర్యాలతో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంగా కావడం, 10 జిల్లాల కూడలి గా నిత్యం వందలాది బస్సులు రాకపోకలు ఎప్పుడు ప్రయాణికుల రద్దీ, సిద్దిపేట పెరిగిన  జనాభా దృష్ట్యా పాత బస్టాండ్ ను పునర్నిర్మాణం చేసి మోడల్ గా తీర్చిదిద్దనున్నామని చెప్పారు.

Related posts

“నువ్వు వెళ్ళే ఈ రహదారికి జోహార్” వెబ్ మూవీ పోస్టరు ఆవిష్కరణ

Satyam NEWS

కార్మికులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్

Satyam NEWS

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన టోనీ అబాట్

Satyam NEWS

Leave a Comment