22.2 C
Hyderabad
December 10, 2024 11: 12 AM
Slider సినిమా

ప్రతికూల పరిస్థితులతో ఫుట్ బాల్ ఆడే ప్రేమికుల కథ “డ్యూడ్”

#dude

యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న వినూత్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తుండడం విశేషం. రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ -2025 విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం. “శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష” వివిధ రంగాలకు చెంది, ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, “జింకే మారి” ఫేమ్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా… “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్.

Related posts

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

మరో లాక్ డౌన్ తప్పదు…సీసీఎంబి డైరెక్టర్ సంచలన వార్త!

Sub Editor

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna

Leave a Comment