38.2 C
Hyderabad
April 25, 2024 11: 40 AM
Slider విజయనగరం

దాదాపు కోటి యాభై లక్ష‌ల‌తో పెద్ద చెరువు వ‌ద్ద అధునాతన‌ పార్క్

#mlakolagatla

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మాట్లాడిన విజయనగరం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ను  ఎదిగిన త‌రుణంలో  న‌గ‌రాన్ని  మ‌రింత సుంద‌రంగా అభివృద్ది చేయ‌ట‌మే పాల‌కుల  త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. కార్పొరేష‌న్ మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మితో  క‌లిసి ..న‌గ‌రంలోని  పీజీ స్టార్ హాస్ప‌ట‌ల్ వ‌ద్ద రామానాయుడు రోడ్ వ‌ద్ద ఉన్న పెద్ద‌చెరువు ప్రాంగ‌ణంలో పార్క్  అభివృద్ది ప‌నుల‌కు ఎమ్మెల్యే కోల‌గట్ల…మేయ‌ర్ తో శంకుస్థాప‌న చేసారు. ఈ సంద‌ర్బఃంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ… ఈ  అభివృద్ది  ప‌నుల‌కు త‌మ ప్ర‌భుత్వం కోటి యాభై ల‌క్ష‌ల‌ను వెచ్చింద‌న్నారు. ఇప్ప‌టికే  ఈ  వ‌ర్క్ కు సంబంధించి టెండ‌ర్లు పిల‌వడం జరిగింద‌ని…మూడు నె ల‌లో పార్క్ అభివృద్ది ప‌నులు పూర్తవుతాయ‌న్నారు.

మీడియా ముందే మున్సిప‌ల్ ఎంఈ పై ఎమ్మెల్యే ఆగ్ర‌హం….!

అయితే ముందు రోజు…ట్రాపిక్ అధికారుల‌తో న‌గ‌రంలో ర‌ద్దీ అయిన ట్రాఫిక్ న క్ర‌మ‌బ‌ద్దీక‌రించేంద‌కు ట్రాఫిక్ డీఎస్పీ…న‌గ‌రంలోని పెద్ద‌ల‌తో మున్సిప‌ల్ క‌మీష‌న‌రేట్ కార్యాల‌యంలో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం చేసారు.ఈ సంద‌ర్బఃంగా పెద్ద చెరువు వ‌ద్ద‌పార్క్ అభివృద్ది ప‌నుల‌కు శంకు స్థాప‌న కార్య‌క్ర‌మానికి  సంబంధించి అంత‌వ‌ర‌కు ఎమ్మెల్యేకు గాని మేయ‌ర్ గాని స‌మాచారం రాలేదు.స‌రిగ్గా ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌స‌మావేశానికి మీడియా కూడ రావ‌డంతో…అప్పుడే మున్సిప‌ల్ ఈఈపై తీవ్ర ఆగ్ర ఆవేశం వ్యక్తం చేసారు…ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌. ముందుగా మాకు సమాచారం చెప్ప‌క‌పోవ‌డం మీ బాధ్య‌తారాహిత్యం కాదా…? కాద‌ని చెప్పండి…నేనేనా రాజీనామా చేస్తాను..మిమ్మ‌ల్ని ఏనా స‌స్పెండ్ చేయ‌మంటాన‌ని ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

Related posts

జగదీష్ మృతిపట్ల మంత్రి పువ్వాడ సంతాపం

Bhavani

యల్లారెడ్డి గూడా శ్రీహనుమాన్ దేవాలయ నూతన కమిటీ

Satyam NEWS

‘‘మాట తప్పి…మడం తిప్పి మా మనసుల్ని గాయపరచద్దు జగన్’’

Satyam NEWS

Leave a Comment