మహాభారత యుద్ధంలో కీలక ఘటమైన గీతోపదేశం సన్నివేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లను ముద్రించి రూపొందించిన క్యాలెండర్ ను నేడు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోడీ అర్జునుడులాగా రధం పైన ఉండగా రధ సారధ్యం చేస్తున్నది కేంద్ర హోం మంత్రి అమిత్ షా గా చిత్రీకరించారు.
ఎంతో పాపులర్ అయిన ఈ గీతోపదేశం సన్నివేశంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బొమ్మలను పెట్టి క్యాలెండర్ రూపొందించడం చాలా బాగుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. హైదరాబాద్ ఘోషామహల్ లోని మణికంఠ హోటల్స్ చైర్మన్ రాకేష్ జైస్వాల్ ఈ క్యాలెండర్ ను రూపొందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఈ క్యాలెండర్ రూపొందించారని ఎమ్మెల్యే రాజా సింగ్ కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర్ నిర్మాణంపై పురోగతి తదితర అంశాలను ఈ క్యాలెండర్ లో ప్రస్తావించారు.