హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కూడా ఐటి సంస్థలను విస్తరించాలని ఎంఎల్‌ఎ వివేకానంద్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఐటి పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయాలని ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు వివేకానంద్ సూచించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఐదేళ్లలో ఐటి ఎగుమతులు రెట్టింపు చేశామని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. యుపిఎ ప్రభుత్వం ఐటిఐఆర్ పాలసీని ప్రకటించినా ఒక్క పైసా ఇవ్వలేదని, ఎన్‌డిఎ హయంలో కూడా ఐటిఐఆర్ కోసం తాను పోరాడానని, ఐటిఐఆర్ ను కొనసాగించబోమని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ నలుగు వైపులా ఐటి పరిశ్రమను విస్తరిస్తామని చెప్పారు. పాతబస్తీలో ఐటి కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌లో కూడా ఐటి టవర్‌ను ఏర్పాటు చేస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఐటి పరిశ్రమలో అద్భుత పురోగతి సాధించామని, ప్రభుత్వాన్ని, ఐటి మంత్రిని అభినందిస్తున్నామని ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసి తెలిపారు.
previous post