39.2 C
Hyderabad
April 25, 2024 17: 27 PM
Slider ప్రత్యేకం

9 ఏళ్ల ప్రధాని మోడీ పాలన లో ఏం చేశామంటే….!

#meghaval

హైదరాబాద్ లో మీడియా తో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్  హైదరాబాద్ లోని మాదాపూర్ దసపల్లా హోటల్ లో మీడియాతో ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, రిటైర్డ్ డీజీ కృష్ణప్రసాద్, టీ ఎస్ పీ ఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్. విఠల్, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, కట్టా సుధాకర్, రాష్ట్ర నాయకులు పాపారావు,  భరత్, వెంకటరమణ, వీరెళ్లి చంద్రశేఖర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 ఏళ్ల ప్రధాని మోడీ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరణతో పాటు ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….

గత యూపీఏ హయాంలో అవినీతి తాండవించేది. అందుకు భిన్నంగా అవినీతికి తావులేని రీతిలో పారదర్శకంగా ప్రధాని మోడీ పాలనను అందిస్తున్నారని చెప్పారు.కరోనా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడారు. దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించారని తెలిపారు.

పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇండ్లను నిర్మించారు. ఇందిరా ఆవాస్ యోజన కంటే మెరుగైన పథకం. ఇంటి నిర్మాణం కోసం మూడు విడత సాయం చేసేవాళ్లు. అది కూడా కలెక్టరేట్ కు సర్టిఫికేట్ సమర్పించాలి. టెక్నాలజీని ఉఫయోగించుకుని జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారుడికి ఇబ్బంది లేకుండా చేశామన్నారు.దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ 10 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్న లక్ష్యానికంటే అధికంగా నిర్మించారని చెప్పారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోవిడ్ సమయంలో 80  కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్ అందించామన్నారు.

జన్ ధన్ యోజన ఖాతా ఉన్న వాళ్లకు కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నప్పటికీ పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేశామని గుర్తు చేశారు.

జన ఔషధి కేంద్రాల ద్వారా 9 వేల 3 వందలకుపైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించేది జన ఔషధీ కేంద్రాల్లో 15 రూపాయలకే అందిస్తున్నాం. ఇది మెడిసన్ కాదు.. మోడీసన్..అని చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే లైన్లను ఆధునీకకరించారు.  కరీంనగర్ –వరంగల్ రైల్వే లైన్, మహబూబ్ నగర్ – విశాఖపట్నం రైల్వే లైన్ మంజూరయ్యాయని తెలిపారు

అంబేద్కర్ పంచ్ తీర్థాలను ఏర్పాటు చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట అతిపెద్ద సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్దిక వ్రుద్ధిలో ఇంగ్లాండ్ ను అధిగమించడమే కాకుండా 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చామని స్పష్టం చేశారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా దూసుకెళుతున్నామని అన్నారు.100 యూనికార్న్ లు, లక్ష స్టార్టప్ లతో దూసుకెళుతున్నామని చెప్పారు.    

న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నాం. ఖేలో ఇండియా పేరుతో పెద్ద ఎత్తున స్టేడియంలు నిర్మించామని స్పష్టం చేశారు.         

విరాసత్ ఔర్ వికాస్ పేరుతో 231 ప్రముఖ దేవాలయాలను అభివ్రుద్ధి చేసి దివ్వ క్షేత్రాలుగా తీర్చిదిద్దాం. భారతీయ సంస్క్రుతి, సనాతన ధర్మాన్నిని ఫరిఢవిల్లేలా చేస్తున్నామని చెప్పారు.

31 రాష్ట్రాల్లో 500 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి అభివ్రుద్ధి చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివ్రుద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.

జాతీయ భద్రత ద్రుష్ట్యా రక్షణ శాఖ లక్ష కోట్ల విలువైన ఉపకరణాలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు.

యెమన్, సిరియా, ఆప్ఝనిస్తాన్, నేపాల్, సూడాన్ లో ఉన్న దాదాపు 20 వేల మందిని భారత ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించిందని అన్నారు. కోవిడ్ సందర్భంగా విదేశాల్లు ఉన్న 2.97 కోట్ల మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కేంద్ర  ప్రభుత్వానిదేనని అన్నారు.

భారత్ వసుధైక కుటుంబం.. జీ-20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని మోదీ ది బాస్ అని అభివర్ణిస్తే…కోవిడ్ నుండి దేశాన్ని కాపాడినందుకు పపువా న్యూగినియా ప్రధాని ఏకంగా నరేంద్ర మోడీ కి పాదాభివందం చేశారని  అన్నారు.

Related posts

మనసున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది

Satyam NEWS

రావివలస మల్లికార్జునుడిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

Satyam NEWS

“ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు

Satyam NEWS

Leave a Comment