32.7 C
Hyderabad
March 29, 2024 13: 13 PM
Slider ప్రత్యేకం

మే డే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

#tammineni

మే డే స్ఫూర్తితో దేశ ఐక్యతకు విగాథం కలిగించే మతోన్మాద, కార్మిక వర్గ వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం హక్కులను, దేశాన్ని కాపాడుకోగలమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.సిపిఎం, సిఐటియు కమిటీల ఆధ్వర్యంలో వివిధ యూనియన్ల జెండాలను 137 వ మేడే దినోత్సవం సందర్భంగా ఖమ్మం లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కొత్త హక్కుల కోసం కొట్లాడాల్సింది పోయి ఈ బిజెపి ప్రభుత్వంలో ఉన్న హక్కులను పరిరక్షించుకోవడం కోసం కార్మిక వర్గం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

బ్రిటిష్ కాలంలో పోరాడు సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం నేడు తొలగించబడుతుందన్నారు. 8 గంటల పని దినం కోసం మరో చికాగో పోరాటాన్ని మన దేశంలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మొత్తం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా తీసుకొచ్చి కార్మికులకు గుండెకాయ లాంటి అనేక అంశాలనుతొలగించారన్నారు. మోదీ ప్రభుత్వం ఒకపక్క కార్పొరేట్ అనుకూల విధానాలు మరోపక్క మతోన్మాద చర్యలను రెచ్చగొడుతూ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వర్గ ఐక్యతను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుంద న్నారు.

మనుధర్మం ఆధారంగా ప్రభుత్వ పాలన కొనసాగించాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ విధానాల ఫలితంగా రోజురోజుకీ అంతరాలు పెరిగిపోతున్నాయని, ఆకలి ఉన్నంతకాలం, సమస్యలు ఉన్నంతకాలం, అంతరాలు ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటదని దీనిని ఆపడం ఎవరి తరం కాదని ఎర్రజెండా నీడన మేడే స్ఫూర్తితో ని మరొక్కసారి దేశమంతా కార్మిక వర్గం, అన్ని వర్గాలు గర్జించి దేశ రక్షణ కోసం పోరాటాలలోకి రావాలని పిలుపునిచ్చారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గోంతులను సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఉపయోగించి నిర్బంధాలకు గురిచేస్తుందన్నారు. ఎదురు తిరిగిన వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదన్నారు. కావున రాజ్యాంగం కల్పించబడిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును స్వతంత్రంగా ఉపయోగించుకునే లాగా మేడే స్ఫూర్తితో ఐక్యతను చాటి పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Related posts

దుకాణాల ముందు జనాలు క్యూ కోసం గడులు ఏర్పాటు

Satyam NEWS

జగన్ గురూజీ ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం

Satyam NEWS

పురుగు కుట్టి ఆరుగురు హాస్టల్ బాలికలు సీరియస్

Satyam NEWS

Leave a Comment