36.2 C
Hyderabad
April 18, 2024 14: 18 PM
Slider సంపాదకీయం

అవినీతిపరులను రక్షించేందుకు కేంద్రం మార్గదర్శకాలు

#NarendraModi

అవినీతిపరులను చీల్చి చెండాడుతాడని ఇంతకాలం ప్రధాని నరేంద్రమోడీ గురించి అందరూ అనుకున్నారు. కానీ తాజాగా జరిగిన పరిణామం చూస్తే ఆయన అవినీతిపరులను కాపాడేందుకే కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నది.

అధికారంలో ఉన్న వారి అనుమతి లేకుండా ఇకపై అవినీతి అధికారులపై గానీ, ప్రజాప్రతినిధులపై గానీ కేసులు పెట్టే వీలు లేకుండా అవినీతి నిరోధక చట్టానికి నరేంద్రమోడీ ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది.

అధికారంలో ఉన్నవాడే అవినీతి చేస్తాడు. మరి అలాంటి వాడిపై కేసులు పెట్టాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఏమో తెలియదు కానీ నరేంద్రమోడీ మాత్రం పటిష్టమైన, 30 సంవత్సరాలుగా దేశంలో అమలులో ఉన్న అవినీతి నిరోధక చట్టం 1988కి తూట్లు పొడిచే సవరణ తీసుకువచ్చేశారు.

మోడీ తీసుకువచ్చిన ఈ సవరణతో ఇక పబ్లిక్ సర్వెంట్లపై అవినీతి కేసులు పెట్టడం సాధ్యం కాదు. ప్రజాప్రతినిధులపై ఉన్న అవినీతి కేసులు తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూంటే ఇక కొత్తగా ప్రజాప్రతినిధులపై కేసులు వేయకుండా కేంద్రం ఈ కొత్త ఆదేశాలు జారీ చేస్తోంది.

తాజాగా ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు , పబ్లిక్‌ సర్వెంట్లపై అవినీతి కేసులు పెట్టే విధానాన్ని నియంత్రిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరు పడితే వారు కేసులు పెట్టడానికి ఇక లేదు. డీజీ స్థాయి అధికారి మాత్రమే కేసు పెట్టగలరు.

అదీ కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోనిదే చేయలేరు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డీజీ స్థాయి అధికారి మాత్రమే కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్లు, ఎండీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవడానికి వీలుంటుంది.

డీజీ స్థాయి అధికారి ఫిర్యాదుకు సాక్ష్యాలు ఉన్నాయో లేవో చూస్తారు. ఆ తర్వాత వాటిని నిర్ధారణ చేసుకోవాలి. ఆ వివరాలను దర్యాప్తు అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులో స్పష్టంగా చెప్పాలి. చివరిగా ప్రభుత్వం కేసు పెట్టాలో వద్దో నిర్ణయం తీసుకుంటుంది.

ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ అయ్యేపనులేనా?. 1988లో రాజీవ్‌గాంధీ హయాంలో అవినీతి నిరోధక చట్టం తీసుకు వచ్చారు. వీటిని సడలిస్తూ మోడీ ప్రభుత్వం 2018లో కొత్త చట్టం తెచ్చింది. దానికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను సోమవారం నోటిఫై చేశారు.

పబ్లిక్ సర్వెంట్‌ కేటగిరి కిందకు వచ్చే వారందరిపై కేసులు పెట్టే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పద్దతి తెచ్చేందుకు కేంద్రం ఇలా చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ చట్టం ప్రకారం ఇక అధికారంలో ఉన్న పార్టీలకు సన్నిహితంగా ఉండేవారిపై కేసులు పెట్టడం అసాధ్యం.

Related posts

పెదవేగి ఎంపిపిగా తాతా రమ్య ప్రమాణస్వీకారం రేపు

Satyam NEWS

మూడు రాజధానుల రచ్చపై గంగుల ప్రతాప్ రెడ్డి ఫైర్

Satyam NEWS

ఢిల్లీని వెనక్కి నెట్టిన కతిహార్

Murali Krishna

Leave a Comment