39.2 C
Hyderabad
March 28, 2024 14: 51 PM
Slider ప్రపంచం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ పాత్ర ఏమిటి?

#DonaldTrump

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇది నిజమే. అయితే ప్రత్యక్షంగా కాదు. పరోక్షంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ఫొటోలు విరివిగా వాడుకోబోతున్నారు. అంతే కాదు. నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వీడియోలతో ఒక చిత్రమాలకి, డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన వీడియోలతో చిత్ర మాలిక కూడా రూపొందించారు.

మోడీ అమెరికా ప్రసంగాలపై ప్రత్యేక వీడియో రూపొందించారు. అమెరికాలో ఉన్న 2.5 మిలియన్ భారత సంతతి ఓటర్లను ఆకట్టుకోవడానికి డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్రమోడీ సమ్మోహన శక్తి పని చేస్తే అమెరికాలోని భారతీయ సంతతి ఓట్లు అందరూ తనకే ఓటు వేస్తారని ట్రంప్ అనుకుంటున్నారు. అదీ సంగతి.

Related posts

ప్రాచీన కళలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

Satyam NEWS

బూస్టర్ డోస్ కోసం కొత్త మార్గదర్శకాలు జారీ

Sub Editor

క్రిస్మస్:నాన్న విజయవాడలో కొడుకు గుంటూరులో

Satyam NEWS

Leave a Comment