బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో పీఎంవోలో మోదీని కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు శుభలేఖ అందించారు.
ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం భారత్ నుంచి అతిథులు వెళ్లేందుకు సీఎం రమేశ్ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేశారు.