ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గమైన వారణాసీలోని కళాశాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) విజయఢంకా మోగించింది. వారణాసి నగరంలోని సంపూర్ణానంద సంస్కృత్ విశ్వ విద్యాలయంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)పై ఎన్ఎస్‌యూఐ ఘన విజయం సాధించింది. ఎన్ఎస్‌యూఐ అభ్యర్థి శివం శుక్లా 485 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. చందన్ కుమార్ మిశ్రా కళాశాల విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా 554 ఓట్లతో గెలిచారు. ఎన్ఎస్‌యూఐకు చెందిన అభ్యర్థి ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీపై ఎన్ఎస్‌యూఐ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.
previous post