31.2 C
Hyderabad
April 19, 2024 06: 43 AM
Slider మహబూబ్ నగర్

కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ సర్కార్: ఏఐటియుసి

ఏ ఐ టి యూసి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ఏఐటియుసి నేతలు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో నేడు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐటియుసి పతాకాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ పావని ఆవిష్కరించారు. ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు టి కిరణ్ అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ పావని , ఏఐటియుసి జిల్లా నిర్మాణ బాధ్యులు ఎం బాల నరసింహ, ఇన్సప్ రాష్ట్ర బాధ్యులు ఎస్ఎండీ ఫయాజ్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే యేసయ్య, టీ నరసింహ, పెబ్బేటి విజయుడు, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇందిరా, సిపిఐ నాయకులు బుల్లెద్దుల శ్రీనివాసులు, లక్ష్మీపతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, వైయస్ జిల్లా అధ్యక్షులు మారేడు శివశంకర్, సిపిఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పట్టణ కార్యదర్శి యూసుఫ్ బిల్డింగ్ వర్కర్స్, హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, పాలు రంగాల కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం ఏఐటీయూసీ అని వక్తలు అన్నారు. 8 గంటల పని దినాన్ని నేడు మోడీ సర్కార్ 12 గంటల పని దినానికి పెంచింది అన్నారు. కార్మిక చట్టాలను అణచివేసి లేబర్ కోడ్ లుగా మార్చడం జరిగింది అన్నారు. దేశంలో నూటికి 90% అసంఘటితరంగా కార్మికులే ఉన్నారు. 10% మాత్రమే పర్మినెంట్ ఉద్యోగాలు రైతు మూడు నెలల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి వెనక్కి నెట్టడం జరిగింది అన్నారు. రైతుల మాదిరిగా కార్మికులు కూడా పోరాటాలు చేయాలి అన్నారు.

Related posts

భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ కృతజ్ఞతలు

Sub Editor

కరోనా ఎలర్ట్: జనతా కర్ఫ్యూ క్లాప్స్ లో వైసీపీ నేతలు

Satyam NEWS

మంత్రి రాబ్ డ్: సెల్ఫీ సెల్ఫీ నా కడియం ఏమైంది?

Satyam NEWS

Leave a Comment