28.7 C
Hyderabad
April 20, 2024 03: 58 AM
Slider జాతీయం

ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: ప్రధాని మోడీ

#NarendraModi

దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్ కోసం ఏ రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రధాని చెప్పారు. వచ్చే కొన్ని నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఈ నెల 21 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందిస్తుందని వెల్లడించారు.

ఎవరైనా ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు.

రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటుగా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Related posts

పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభం

Satyam NEWS

ఇది చెరువు కాదు… జగనన్న కాలనీ

Satyam NEWS

బాధ్యతతో పాటు భరోసా ఇచ్చే గొప్ప వృత్తి పోలీస్

Satyam NEWS

Leave a Comment