28.2 C
Hyderabad
June 14, 2025 10: 56 AM
Slider ప్రత్యేకం

మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు

#mohanbabu

మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. మనోజ్ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను. భార్య మాటలు విని మనోజ్‌ నా గుండెలపై తన్నావ్‌. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డాం. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావు. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అయినా కాపాడాను. విద్యాసంస్థల్లో ప్రతీది లీగల్‌గా ఉంది, తప్పులు ఎక్కడా జరగలేదు. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డుకెక్కి నా పరువు తీశావు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. వద్దా అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, అయినా నేను సంపాదించుకున్నా. మనోజ్ నన్ను కొట్టలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డాం. నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను. నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా.

Related posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు

Satyam NEWS

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

mamatha

పెందుర్తి లో భారీగా పట్టుబడ్డ గంజాయి…

mamatha

Leave a Comment

error: Content is protected !!