28.7 C
Hyderabad
April 20, 2024 09: 01 AM
Slider శ్రీకాకుళం

తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం సేవా నిరతి

tarakarama

కరోనా లాక్ డైన్ నేపథ్యంలో శ్రీకాకుళం నగరం లో నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ వారి కోసం తారకరామ మోక్షజ్ఞ సేవాసంఘం మాస్కులు అందచేసింది. ఎస్పీ అమ్మిరెడ్డి మాదారపు యశోదమ్మ 7 వ వర్ధంతి సందర్భం గా ఈ మాస్కులను డేవిడ్ ప్రదీప్ పవన్ ఎస్ పి అమ్మిరెడ్డికి నేడు అందచేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణకు శ్రమిస్తున్న వారికి నగరం లో జిల్లా లో అన్ని వర్గాలు వారు అండగా వుంటున్నారని అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్ డౌన్ కార్యక్రమం ప్రకారం ఉదయం11 దాటిన తర్వాత ఎవరూ రోడ్ల పై అనవసరంగా తిరగవద్దని, సామజిక దూరం పాటించాలని అందరూ ఆరోగ్యం గా ఉండాలని కోరారు.

అనంతరం సేవా సంఘం వారు కొన్ని కూడళ్లలో డ్యూటీ లు చేస్తున్న పోలీస్ వారికీ మాస్కులు, సానిటేజర్స్ అందించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ ఈ మహమ్మారి నియంత్రణలో అనుక్షణం సరైన విశ్రాంతి, ఆహరం లేక శ్రమిస్తున్న నగరం లో పోలీస్ వారికీ వారి ఆరోగ్య భద్రత నిమిత్తం వీటిని ఈ సేవాసంఘం తరపున తన భార్య స్వర్గీయ యశోదమ్మ 7 వర్ధంతి సందర్భంగా అందించడం అభినందనీయమన్నారు.

ఇప్పటికి ఈ సేవా సంఘం ద్వారా కరోనా నియంత్రణ లో నగరం నిరంతర సేవలందిస్తున్న ANM లకు, ఆశా వర్కర్స్ కు రోజుకు 2 చొప్పున ఈ నెల 1 నుండి ఇప్పటి వరకు మజ్జిగ పాకెట్స్ అందిస్తున్నారని, హైవే పై రోజు 100మంది వలసదారులకు పాదచారులకు, యాచకులకు భోజనాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, నీలు సురేంద్ర, సతీష్, సోమేశ్, దుర్గా, దేవా మోహన్, రఘు, తారక్, జగదీశ్, మణి, పృథ్వి ,రాజశేఖర్ సుధీర్, నితిన్ పాల్గొన్నారు.

Related posts

రాయపూర్-విశాఖ రహదారి ని అభివృద్ధి చేసిందెవరనుకున్నారు…!

Bhavani

రజాకార్ల పాలన గుర్తుకు తెస్తున్న కేసీఆర్

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో పల్లెపల్లెకు అంబేద్కర్

Satyam NEWS

Leave a Comment