రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని 26 వ వార్డు లో కౌన్సిలర్ తెరాస అభ్యర్థి (మాజీ మున్సిపల్ చైర్మన్)నామాల ఉమ లక్ష్మీరాజ్యం ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేస్తూ కెమెరాకు దొరికిపోయారు.
వార్డులోని ఒక ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు డబ్బులను పంపిణీ చేయిస్తున్న దృశ్యాన్ని అందులోని వారే తీసి మీడియాకు పంపారు. ఇప్పడు ఆ వీడియో సంచలనంగా మారింది. 26 వార్డు తెరాస అభ్యర్థి నామాల ఉమ లక్ష్మీ రాజ్యం ను వివరణ అడుగగా ఇంట్లో పని చేసినందుకు డబ్బులు పంచామని చెబుతున్నారు.
ఎన్నికల సంఘానికి ఈ వీడియోతో సహా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యర్థులు సిద్ధం అవుతున్నారు. దీన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంటే ఎన్నిక రద్దయ్యే అవకాశం కూడా ఉందని పరిశీలకులు అంటున్నారు.