అటవీ ప్రాంతం పొదలలో తిరిగే ఉడుము పట్టణంలోని ఓ ఇంట్లోకి దూసుకొచ్చింది. సోమవారం కొల్లాపూర్ పట్టణం ఇందిరకాలని లోకి అటవీ ప్రాంతం పొదలలో తిరిగే ఉడుము అవుట బాలస్వామి ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను కంగారు పెట్టింది. కుటుంభ సభ్యులు తలుపులు మూసి జాగ్రత పడ్డారు. అయితే ఉడుము కొద్దిసేపు కుటుంబ సభ్యులను హడలెతించింది. వెంటనే ఇంటి యజమాని ఔట బాలస్వమి, రాజశేఖర్ చాకచక్యంగా దాన్ని పట్టుకున్నారు. దానికి ఎలాంటి హానీ చేయకుండా సంచిలోబంధించారు. ఆ తర్వాత కొల్లాపూర్ రేంజ్ ఆఫీసర్ మనోహర్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే స్పందించారు. సెక్షన్ ఆఫీసర్ మన్యంమాయ్యకు ఆదేశాలు ఇవ్వడంతో బీట్ ఆఫీసర్ వినోద్, నవీన్, గోపాల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉడుమును పరిశీలించారు. పాముజాతిలో ఉంటాయి కాబట్టి సుమారు3కిలోల బరువుఉంటుందని రేంజర్ మనోహర్ చెప్పారు. ఒకోక్కసారి దారి తప్పివస్తుంటాయి అని ఆయన అన్నారు. ఈ సంఘటలో అవుట రాజశేఖర్ కు స్వల్ప గాయాలైనాయి. ఉడుమును అటవీశాఖ అధికారులకుఅప్పగించారు. వారు చికిత్సా అందించి అటవిలోకి వదిలారు.
previous post