35.2 C
Hyderabad
April 20, 2024 17: 26 PM
Slider ముఖ్యంశాలు

మరింతగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

#Monsoon Advances

నైరుతి రుతుపవనాల వ్యాప్తి కొనసాగుతోంది. కర్వార్, హస్సన్, కన్యాకుమారి, కోయంబత్తూర్ వరకూ నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరి, కరైక్కల్, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతాల్లోకి రుతుపవనాలు మరింతగా వ్యాపిస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈనెల ఎనిమిది నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చు. ఇది బలపడితే తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు దాదాపు పొడివాతావరణమే ఉంటుంది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ, యానంలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఎల్లుండి తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Related posts

ఐ ఎన్ టి యు సి మండల మహిళా అధ్యక్షురాలిగా ఎడవెల్లి ధనలక్ష్మి

Bhavani

అమ్మలేదు… నాన్నను కరోనా మింగింది… అయితేనేం… మేమున్నాం

Satyam NEWS

డిమాండ్: ఎన్నికలు వాయిదా కాదు వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment