37.2 C
Hyderabad
March 29, 2024 18: 43 PM
Slider ముఖ్యంశాలు

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

#Whether Report

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి, మాల్దీవులు, కన్యాకుమారి ప్రాంతాల్లో మరికొంత ముందుకి వ్యాపించాయి. ఇవి రాగల 24 గంటల్లో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి, మాల్దీవులు, కన్యాకుమారి ప్రాంతాల్లో మరింత ముందుకు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అరేబియా సముద్రంలో ఒమన్ దక్షిణ కోస్తాలొ వాయుగుండం బలపడుతోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో రానున్న 48 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడి మరునాటికల్లా వాయుగుండంగా మారుతుంది. నేటి నుంచి జూన్ 2 వరకూ సూర్యతాపం, వడగాడ్పులు ఉండవని వాతావరణ శాఖ ప్రకటించింది.

నేడు రేపూ దక్షిణాది రాష్ట్రాలలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయి. కేరళ కర్నాటకల్లో అతిభారీ వర్షాలు పడతాయి. తెలంగాణలో నేడు, రేపు 30-40 కిలోమీటర్ల వేగంతో చెదురుమదురుగా ఉరుములతో కూడిన గాలివానలు పడతాయి. కోస్తాంధ్రలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. రేపు రాయలసీమలో కూడా వర్షాలు పడతాయి.

Related posts

దళితుల భూముల్లో మెగా పార్కు నిర్మించవద్దు

Satyam NEWS

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2

పొలం వాకిట్లోకి సాగునీళ్లు…. ఇంటి పోయికాడికే తాగునీళ్లు

Satyam NEWS

Leave a Comment