33.2 C
Hyderabad
April 26, 2024 02: 33 AM
Slider హైదరాబాద్

హిందూ యువతులను అంతం చేసే “రాక్షస క్రీడా లవ్ జిహాద్”

హిందూ యువతులను లక్ష్యంగా చేసుకొని లవ్ జిహాద్ అనే రాక్షస క్రీడా కొనసాగిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ (VHP) మండిపడింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు గురి చేయడం.. చిత్రహింసలుపెట్టడం.. అవసరం తీరాక అమ్మి వేయడం,లేదా హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం హైదరాబాద్ లోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో ప్రచార విభాగం సమావేశం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్యదర్శి పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామిలు మాట్లాడారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో లవ్ జిహాద్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాగ్యనగర్, నిజామాబాద్, కర్నూలు, నెల్లూరు కేంద్రాలుగా ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పరువుకు భయపడి చాలామంది హిందూ అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు ఈ విషయాలను పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లడం లేదని.. ఒకవేళ తీసుకువెళ్లినా కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలోని పోలీస్ స్టేషన్ లలో నమోదైన ఎఫ్ ఐ ఆర్ లను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే 2000కు పైగా లవ్ జోహార్ కేసులు ఉన్నాయని వివరించారు. ముస్లిం అబ్బాయిలు హిందూ పేర్లు పెట్టుకుని.. హిందువుల జీవన విధానం అవలంబిస్తున్నట్టు బొట్టు పెట్టుకొని హిందూ అమ్మాయిలను ప్రేమ ముసుగులో ట్రాప్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం.. మతం మార్చడం.. లేదంటే హత్యలు చేయడం సర్వసాధారణంగా సాగుతున్నాయని చర్చించారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసినా శ్రద్ధ వాకర్- ఆస్తాబ్ ల ఘటన ఓ ఉదాహరణ అన్నారు. తల్లి , తండ్రి కుటుంబాన్ని వదిలేసి వచ్చిన శ్రద్ధ వాకర్ అనే యువతిని 35 ముక్కలు నరికేసి ఫ్రిజ్లో దాచిపెట్టిన ఘటన యావత్ ప్రపంచాన్నే నిర్గాంత పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లవ్ జిహాద్ కట్టడి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి హిందూ అమ్మాయిలను రక్షించాలన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి, కాపురం చేస్తున్న సమయంలో హిందూ యువతులను చంపేసే వారిని బహిరంగంగా ఉరితీయాలన్నారు. ఇప్పటికైనా ప్రతి హిందూ యువతి మేల్కొని ప్రేమ విషయంలో గుడ్డిగా నమ్మకుండా, అవతలి వ్యక్తి నడవడికను గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు సూచించారు. సాంకేతికత.. సోషల్ మీడియాను ఆధారంగా హిందూ యువతులను వంచించే రాక్షసక్రీడ సాగుతోందని.. దాని పేరే లవ్ జిహాద్ అని వివరించారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను ప్రలోభాలకు గురి చేసేందుకు కొన్ని సంస్థలు విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిస్తున్నాయని పేర్కొన్నారు. కులం ఆధారంగా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకొని వేటాడుతున్నారన్నారు. ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలో విశ్వహిందూ పరిషత్ సమాజాన్ని జాగృతం చేస్తూ వస్తోందన్నారు. ప్రతి కళాశాల, యూనివర్సిటీ కేంద్రంగా వచ్చే రోజులలో లవ్ జిహాద్ పేరుపైన సెమినార్లు నిర్వహిస్తామని వారు చెప్పారు. అందుకు ప్రత్యేకంగా దుర్గా వాహిని, బజరంగ్ దళ్ సంస్థలు యువతి యువతులను చైతన్య పరుస్తాయన్నారు. హిందూ సమాజానికి ఇటువంటి విషయంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా విశ్వహిందూ పరిషత్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ జి, రాష్ట్ర కోశాధికారి లక్ష్మీ శేఖర్, గోరక్ష క్షేత్ర ప్రముఖ్ యాదగిరి రావు, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ శివ రాములు, శ్రీనివాసులు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ.5 కోట్ల బంగారం స్మగ్లింగ్

Satyam NEWS

టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

Satyam NEWS

USFI జాతీయ కన్వీనింగ్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా పరశురాం

Satyam NEWS

Leave a Comment