36.2 C
Hyderabad
April 18, 2024 14: 22 PM
Slider విజయనగరం

పోలీసుల అదుపులోకి “నెల రోజుల” అఫెండర్…

#policecustody

ఎక్కడైనా పోలీసులు… ఓ దొంగ ను పట్టుకోవాలన్నా..ఏ కేసును అయినా ఛేదించాలన్న…స్టేషన్ లో కింది స్థాయిలో పని చేసే క్రైమ్ బృందాలే కీలకం. ఈ పాత్ర ను పోషించడమే కాకుండా…27 దొంగతనాలు చేసిన నిందితుడు ని..అలాగే నెల రోజుల పాటు వరుసగా ఇండ్ల దొంగతనాలు చేసి….పోలీసులకే ముచ్చెమటలు పట్టించిన 27 దొంగతనాలు చేసిన నిందితుడిని విజయనగరం లో వన్ టౌన్, టూటౌన్ క్రైమ్ టీంలు పట్టుకున్నాయి.స్వయంగా జిల్లా పోలీసు బాస్ దీపికా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం విశేషం. సాధారణంగా ఎక్కడా కూడా ఏ ఒక్క పోలీసు బాస్…

కేసులు పరిష్కారంలో కింది స్థాయి అదీ క్రైమ్ టీం ల సహాయం తో ఛేదించామని చెప్పడం అరుదు.కానీ విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా… ప్రత్యేకంగా రెండు స్టేషన్ లలో పని చేసే క్రైమ్ బృందాల వల్లనే 27 దొంగతనాలకు పాల్పడిన అఫెండర్ ను పట్టుకున్నామని చెప్పారు. వాస్తవానికి విజయనగరం జిల్లా బలిజిపేటకు చెందిన మామిడి తిరుపతి రావు…వైజాగ్ లో ఉంటూ…నేరాలకు పాల్పడుతుండే వాడు.ఈ ఏడాది లో జులై 28 నుంచీ ఆగస్టు 20 వరకు వరుసగా విజయనగరం లో ఇండ్ల తాళాలు పగుల గొట్టి దొంగతనాలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో రెండు పోలీస్ స్టేషన్ ల సీఐలు డా.వెంకటరావు, లక్ష్మణరావు లు..తమ ,తమ క్రైమ్ ఐడీ పార్టీలతో నిఘా పెట్టడంతో ఆరు నెలల్లో ఎస్ఐ అశోక్…

అలాగే శాఖ సిబ్బంది అచ్చిరాజు, ప్రసాద్, వాసు ,శ్రీను, శివశంకర్ లతో “నెల రోజుల” నిందితుడు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపికా… శాఖ సిబ్బంది ని అభినందించారు. ఇక నిందితుడు వద్ద నుంచీ 20 న్నర తులాల బంగారం, తొమ్మిది కేజీల వెండి ,లక్ష నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

Satyam NEWS

చారిత్రక ప్రదేశంగా రాజుల కాలం నాటి అతి పురాతన లింగంబావి

Satyam NEWS

కాంగ్రెస్ గెలిచినా టీఆర్ఎస్ కొనేస్తుందని ఓట్లు వేయలేదు

Satyam NEWS

Leave a Comment