31.2 C
Hyderabad
April 19, 2024 02: 59 AM
Slider తెలంగాణ

తెలంగాణ లో పాఠ్యాంశంగా నైతిక విలువలు

moral science

నైతిక విలువల అంశాన్ని పాఠ్యాంశంగా తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని మిషన్ ఎథిక్స్ ఇండియా సొసైటీ అభిప్రాయ పడింది. ఆ సొసైటీ అధ్యక్షుడు, ఎన్ ఐ ఆర్డీ డీజీ ఓఎస్డీ కేసిపెద్ది నరసింహా రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ అయింది.

నైతిక విలువల అంశం పాఠ్యఅంశంగా పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం నేటి తరానికి గొప్ప వరం కానుందని వారు అభిప్రాయ పడ్డారు. నైతిక విలువలు కొరవడటం వల్ల సమాజంలో చిన్నారులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని వారు వినోద్ కుమార్ కు తెలిపారు.

చరిత్రలో అశోక చక్రవర్తి చెట్లు నటించడం, చెరువులను తవ్వించడం వంటి చేసిన కార్యక్రమాలను ప్రస్తుత కాలంలో సీఎం కేసీఆర్ హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ఆచరించి చూపుతూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్న విషయాన్ని వారు వినోద్ కుమార్ తో పంచుకున్నారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నైతిక విలువల అంశాన్ని పాఠ్యాంశంగా తీసుకుని రావాలన్న నిర్ణయంతో సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. ఈ బృందంలో సొసైటీ కార్యదర్శి ప్రతాప్ మల్లాది తదితరులు ఉన్నారు.

Related posts

క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

Bhavani

ఘనంగా తెలుగుదేశం అధ్యక్షుడు రమణ జన్మదిన వేడుక

Satyam NEWS

మృత్యువును జ‌యించిన ఉద్య‌మ నాయ‌కుడు

Sub Editor

Leave a Comment