38.2 C
Hyderabad
April 25, 2024 12: 18 PM
Slider హైదరాబాద్

నీళ్లు నిల్వ ఉంటే దోమలు వస్తాయి జాగ్రత్త

#baghamberpet

నిల్వ ఉన్న నీళ్లల్లో దోమలు ఉత్పత్తి చెందడంతో  ప్రజలు డెంగ్యూ బారిన పడతారని, అందువల్ల అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. వర్షాకాలం, ఇతర సమయాలలో పరిసరాల్లో చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలని ఆమె కోరారు. మల్లికార్జున నగర్ లో డివిజన్ లో నేడు దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బందితో ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దోమల నివారణకు ప్రజలందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా నీళ్లు నిలువ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కూలర్ లలో నిలువ ఉన్న నీటిని తరుచుగా శుభ్రం చేసుకోవాలి, పాడైపోయిన టైర్లు, పూల కుండీలు, కొబ్బరిబోండాలలో నీళ్లు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయి కాబ్బటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీటిని తొలగించాలని సూచించారు.

వాటర్ ట్యాంక్ లు తరుచుగా శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్,  ఎంటమాలాజీ సూపర్వైజర్ కిషన్ నాయక్ ఏంటోమలజీ బృందం  కనకరాజ్,  బి. స్వామి, శివ శంకర్, ప్రవీణ్ కుమార్, స్థానికులు ఆర్.సునీత, స్వామి పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

నవంబర్ 21న ముదిరాజ్ జండాపండుగ వాల్ పోస్టర్ ఆవిష్కరణ!

Satyam NEWS

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం విజయవంతం చేయండి

Satyam NEWS

వైయస్సార్ సిపి ఎజెండా  పేద ప్రజల సంక్షేమం

Satyam NEWS

Leave a Comment