38.2 C
Hyderabad
April 25, 2024 13: 56 PM
Slider ప్రపంచం

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాం

#HeavyRain

ప్రపంచం మొత్తం మీద వరదల కారణంగా అతి భారీగా నష్టపోయిన దేశం ఏదైనా ఉందా? ఉంటే అది మన దేశమేనట!

 ఐక్య రాజ్య సమితిలో ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించే విషయంలో సలహాలు సూచనలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక  విభాగం ఈ అంశంపై తన వైఖరిని తేటతెల్లం  చేసింది.

2018 లో కేవలం ఒక్క ఏడాది కాలంలో వరద నష్టం అంచనా 95,766 కోట్ల రూపాయలు  కాగా గత అరవై ఏళ్ల కాలంలొ రూ. 4.7  లక్షల కోట్ల మేరకు చేరుకుంది.

మొత్తం మీద ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం బీహార్ కాగా వరదల కారణంగా ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అధికమేనట. బీహార్ లోని 38 జిల్లాలలో28 జిల్లాలు వరద బాధిత జిల్లాలుగా రికార్డు ఉంది.

Related posts

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

బాధిత కుటుంబాలకు సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

విశాఖ నగరంలో పట్టుబడ్డ కోటి రూపాయలు

Satyam NEWS

Leave a Comment