ఈరోజు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర గోదావరి నదిలోబోటు ప్రమాదం జరిగి దాదాపు60 మంది గల్లంతయ్యారనే సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే కృష్ణా గోదావరి నదులు లో జరిగిన పడవ బోల్తా సంఘటనలు ఒక ఆదివారం రోజునే ఎక్కువ జరుగుతున్నాయి. విజయవాడ సమీపంలో పవిత్ర సంఘం వద్ద నవంబర్ 12 ఆదివారం 2017 లో కార్తీ క మాసం సందర్భంగా ప్రమాదం జరిగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటు లో ప్రయాణిస్తుండగా బోల్తా పడడంతో 22 మంది చనిపోయారు. అదేవిధంగా జూలై 2018 లో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడటం తో 15 మంది మృతి చెందారు. నిన్న రెండో శనివారం, ఈరోజు ఆదివారం రెండు రోజులు సెలవు దినాలు కావటంతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కు చెందిన ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి విహారయాత్ర కోసమని పాపికొండలు పర్యటనకు బయలుదేరిన సమయంలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
previous post
next post